కంటా రెడ్డి తిరుపతి రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు | ప్రజాసేవకులు | మెదక్ నియోజకవర్గం
కంటా రెడ్డి తిరుపతి రెడ్డి గారు 1968 సంవత్సరంలో మెదక్ జిల్లా, నిజాంపేట్ మండలం, కల్వకుంట గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే కష్టపడి ఎదగాలనే తపనతో పాటు ప్రజలతో మమేకమై పనిచేయాలనే ఆసక్తిని కలిగి ఉన్నారు.
విద్యాభ్యాసం
తిరుపతి రెడ్డి గారు ప్రాథమిక విద్య నుంచి 10వ తరగతి వరకు కల్వకుంట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం రామాయంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తి చేశారు.
వ్యవసాయం నుంచి వ్యాపార రంగం వైపు
తిరుపతి రెడ్డి గారి కుటుంబానికి వ్యవసాయ నేపథ్యం ఉంది. చిన్నతనం నుంచే తండ్రి గారికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉంటూ సుమారు ఐదు సంవత్సరాలు వ్యవసాయ బాధ్యతల్లో భాగస్వాములయ్యారు.
తరువాత హైదరాబాద్‌లో వ్యాపారం, కాంట్రాక్ట్ పనులు, రియల్ ఎస్టేట్ రంగాలపై ఆసక్తి పెంచుకుని తన దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించారు. క్రమంగా వ్యాపార రంగంలో తనదైన గుర్తింపును సంపాదించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు.
రాజకీయ ప్రస్థానం
చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న తిరుపతి రెడ్డి గారు 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, అనంతరం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుమారు పది సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు.
తన రాజకీయ ప్రయాణంలో పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషించారు.
టీఆర్‌ఎస్‌లో రాజకీయ ప్రస్థానం
అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో చేరి తన రాజకీయ అనుభవాన్ని మరింత విస్తరించారు. పార్టీలో తన రాజకీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు, క్షేత్రస్థాయి పరిచయాలతో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు.
మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు గారు, కేటీఆర్ అప్పటి స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తూ మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు.
ప్రజాసేవే ప్రధాన లక్ష్యం
రాజకీయాలతో పాటు ప్రజాసేవకు కూడా తిరుపతి రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.
అన్నదాన కార్యక్రమాలు, పేద కుటుంబాలకు సహాయం, వివాహ కార్యక్రమాల్లో అవసరమైన వారికి అండగా నిలవడం, వివాహ ముహూర్త సామగ్రి పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
గ్రామాల్లోని దేవాలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం కోరినప్పుడు తన వంతు విరాళాలు అందిస్తూ మత సామరస్యానికి, సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు పొందారు.
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా…
నియోజకవర్గంలో పేద కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలవడం, అవసరమైన సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తారు.
అలాగే అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని స్వయంగా వెళ్లి పరామర్శిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యం చెప్పి, ఆత్మీయంగా పలకరించడం ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు.
భవిష్యత్ రాజకీయ లక్ష్యం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం లభిస్తే, తనకు ఉన్న రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం, కార్యకర్తల బలం, గ్రామస్థాయిలో ఉన్న పరిచయాలతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే విశ్వాసాన్ని తిరుపతి రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాసేవ, పార్టీ పట్ల నిబద్ధత, కార్యకర్తల పట్ల ఆత్మీయత, ప్రజల కష్టాల్లో అండగా నిలవడం వంటి అంశాలను తన రాజకీయ ప్రయాణానికి బలంగా చేసుకుని మెదక్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడిగా తిరుపతి రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు.
“ప్రజలతో మమేకమై… ప్రజల కష్టాల్లో అండగా నిలిచి… ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగడం” అనే భావనతో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.