ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి, వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. గ్రామాభివృద్ధి పట్ల అంకితభావంతో 1999లో గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవలో అడుగుపెట్టారు.
తన సేవా భావం, నిజాయితీ, నాయకత్వ లక్షణాల వలన గ్రామ ప్రజల మన్ననలు పొందిన జగన్ మోహన్ రెడ్డి గారు, 2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరిగి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయనకు రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి టి హరీష్ రావు, కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మరియు కేటీఆర్ గార్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
జగన్ మోహన్ రెడ్డి గారు నీతి, నిజాయితీకి ప్రతీకగా నిలుస్తూ గ్రామంలో మంచి చెడులను సమానంగా చూసే నాయకుడిగా పేరు పొందారు. సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ, గ్రామ ప్రజలతో కలిసి ఒకరిగా జీవిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం కృషి చేస్తున్నారు.
“గ్రామం అభివృద్ధి – నా లక్ష్యం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన, వల్లభాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు.