మాధవేని రఘునందన్ రావు (జననం 23 మార్చి 1965)తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం దుబ్బకా కు చెందిన ఎమ్మెల్యే (ఉప ఎన్నిక 2020 లో గెలిచాడు). తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారుగా పేరుపొందాడు. వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన మెదక్ జిల్లా వాసి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి.ప్రస్తుతం మెదక్ లోక్ సభ సభ్యుడు

రఘునందన్ రావు మొదట తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవాడు.  అతను ఏప్రిల్ 27, 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితితో ఉన్నాడు . అతను పొలిట్‌బ్యూరో సభ్యుడు, మెదక్ జిల్లా కన్వీనర్.  14 మే 2013 న తెలుగు దేశ పార్టీ పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే ఆరోపణలపై ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  నుండి సస్పెండ్ చేశారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరారు కానీ ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కొద్ది రోజులకు బీజేపీ లో చేరారు, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని dubbak నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ అధికారిక ప్రతినిధి. పస్తుతం 2020 నవంబరు ఏడో తేదీన జరిగే దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గా పోటీచేసారు.తెలంగాణ రాష్ట్రం దుబ్బకాకు చెందిన ఎమ్మెల్యేగా (ఉప ఎన్నిక 2020 లో) 1068 ఓట్ల మెజారిటీతో విజయం సాదించారు.[11][12][13][

రఘునందన్ రావు 2024లో మెదక్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *