
X SARPANCH CHEGUNTA – MEDAK
BRS PARTY CHEGUNTA
MANCHIKATLA SRINIVAS
ప్రజాసేవకు అంకితభావం కలిగిన నాయకుడు
మంచికంట్ల శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా నాయకుడు. చేగుంట మండలంలో ప్రజల నమ్మకం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. గ్రామాభివృద్ధి, సామాజిక సేవ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా నిలిచారు.
వ్యక్తిగత వివరాలు
పేరు: మంచికంట్ల శ్రీనివాస్
జననం: జూలై 1973
జన్మస్థలం: చేగుంట, మెదక్ జిల్లా
తల్లి: సువర్ణ గారు
తండ్రి: సుదర్శన్ గారు
కుటుంబ నేపథ్యం: ఆయన తండ్రి గారు 1990లో రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసి ప్రజాసేవలో మంచి పేరు సంపాదించారు.
విద్యాభ్యాసం
మంచికంట్ల శ్రీనివాస్ గారు తన ప్రాథమిక మరియు ఉన్నత విద్యను పూర్తిగా చేగుంటలోనే అభ్యసించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం కుటుంబ వ్యాపారంలో తన తండ్రి గారితో కలిసి పనిచేస్తూ వ్యాపార అనుభవాన్ని సంపాదించారు.
రాజకీయ ప్రయాణం
తండ్రి గారి ప్రజాసేవా అడుగుజాడల్లో నడవాలనే లక్ష్యంతో శ్రీనివాస్ గారు రాజకీయాల్లో ప్రవేశించారు.
2003: టిఆర్ఎస్ పార్టీ నుండి టౌన్ ప్రెసిడెంట్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
2016: చేగుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేశారు.
2019: టిఆర్ఎస్ పార్టీ తరఫున CHEHUNTA సర్పంచ్‌గా గెలుపొందారు.
అనంతరం చేగుంట మండల సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు.
సామాజిక సేవా కార్యక్రమాలు
రాజకీయాలతో పాటు సామాజిక సేవలో కూడా శ్రీనివాస్ గారు చురుకుగా పాల్గొన్నారు.
2012: ఆర్యవైశ్య సంఘం – చేగుంట మండల ప్రెసిడెంట్
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా సేవలు
లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్
ZC (Zonal Chairman) గా బాధ్యతలు నిర్వహించారు.
ప్రజా సేవ లక్ష్యం
మంచికంట్లో శ్రీనివాస్ గారు గ్రామాభివృద్ధి, యువత ప్రోత్సాహం, సామాజిక సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు.