MALAVATH BABU SARPANCH WITH MYNAMPALLY HANUMANTH RAO SIR THO

MALAVATH BABU LIFE STYLE

మాలవత్ బాబు గారు 14 నవంబర్ 1997న నిజాంపేట్ మండలంలోని జడ్చర్ల తాండలో జన్మించారు. ఆయన తల్లి లలిత తండ్రి కాలియా గారు. చిన్ననాటి నుంచే కష్టపడి ఎదగాలని సంకల్పంతో జీవితం ప్రారంభించారు.

ఆయన ప్రాథమిక విద్య నుండి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్, నిజాంపేట్ పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం రామాయంపేట్‌లోని స్నేహ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం కుటుంబం వ్యవసాయంపై ఆధారపడినందున వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.

2019లో జరిగిన ఎన్నికలలో ఆయన భార్య రాజ్యలక్ష్మి గారు ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. ఉప సర్పంచ్ పదవిలో ఉన్న కాలంలో నాలుగు సంవత్సరాల పాటు తమ ఆరాధ్య దైవమైన సేవాలాల్ గుడికి ప్రతి నెల విరాళం అందిస్తూ భక్తిని, సేవా భావాన్ని చాటుకున్నారు.

2025లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో డాక్టర్ మోహన్ గారి సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 69 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలిచిన వెంటనే గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ, సేవాలాల్ గుడి నిర్వహణకు తన జీతాన్ని ప్రతినెల విరాళంగా ఇస్తానని ప్రకటించడం ఆయన గొప్ప సేవా మనోభావానికి నిదర్శనం.

అదేవిధంగా హనుమాన్ దేవాలయానికి స్వంత నిధులతో రంగులు వేయించి గుడి అభివృద్ధికి కృషి చేశారు. గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి కలిగిన మాలవత్ బాబు గారు అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ఎదుగుతున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు.

EX – UPA SARPANCH MALAVATH RAJYA LAXMI (2019)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *