బక్కయ్య గారి యాదగిరి
గ్రామ సర్పంచ్ – అక్కన్నపేట్
బక్కయ్య గారి యాదగిరి గారు 12-06-1979 న అక్కన్నపేట్ గ్రామంలో శ్రీమతి నరసవ్వ గారు, శ్రీ నారాయణ గార్లకు జన్మించారు. చిన్నప్పటి నుంచే సేవాభావం కలిగిన యాదగిరి గారు తన విద్యను ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేశారు.
విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ, 1998లో రామాయంపేట్ శాఖ ABVP జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం RSS లో రామాయంపేట్ భాగ్ ప్రముఖ్‌గా సేవలందిస్తూ సామాజిక మరియు జాతీయ భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారు.
రాజకీయ రంగంలో ప్రజాసేవ లక్ష్యంగా
2000లో వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓటమి
2019లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి
అయినా కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిరంతరం చురుకుగా పాల్గొన్నారు. ప్రజలతో కలిసిమెలిసి ఉండే ఆయన స్వభావం, అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం ఆయనను ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.
గ్రామ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించే యాదగిరి గారు, ప్రజల సమస్యలను తన సమస్యలుగా తీసుకొని పరిష్కరించే నాయకుడిగా పేరు సంపాదించారు.
బీజేపీ డైనమిక్ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారి ఆశీస్సులతో,
2025 సర్పంచ్ ఎన్నికల్లో 627 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
యాదగిరి గారి ప్రత్యేకత:
“పిలిస్తే పలికే నాయకుడు – ప్రజల మధ్య ఉండే నిజమైన సేవకుడు”
ప్రజల కోసం – ప్రజల మధ్య – ప్రజల నాయకుడు
గ్రామాభివృద్ధి నా ధ్యేయం
సేవే లక్ష్యం – అభివృద్ధే మార్గం