
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు | ప్రజా సేవకుడు | బీసీ వర్గాల రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు
పేరు: మామిళ్ల ఆంజనేయులు
జన్మతేదీ: 08-03-1970
జన్మస్థలం: జక్కన్నపేట గ్రామం, హవేలీ ఘనపూర్ మండలం, మెదక్ జిల్లా,
ప్రస్తుత రాజకీయ బాధ్యత: బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి నాయకుడు ,మెదక్ మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ ,
బాల్యం – విద్యాభ్యాసం
మామిళ్ల ఆంజనేయులు గారు 08 మార్చి 1970న మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో జన్మించారు. తండ్రి మామిళ్ల మైసయ్య గారు ప్రాథమిక సహకార సంఘం (PACS) డైరెక్టర్‌గా పనిచేశారు. తండ్రి గారి రాజకీయ, సామాజిక అనుభవాలు చిన్ననాటి నుంచే ఆంజనేయులు గారిపై ప్రభావం చూపాయి.
జక్కన్నపేటలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని మహబూబియా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని న్యూ డిగ్రీ కాలేజీలో డిగ్రీ విద్యను అభ్యసించారు.
చిన్న వయసులోనే రాజకీయాల వైపు అడుగులు
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో విద్యార్థి దశలోనే మామిళ్ల ఆంజనేయులు గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
క్కన్నపేటలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని మహబూబియా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని న్యూ డిగ్రీ కాలేజీలో డిగ్రీ విద్యను అభ్యసించారు.
చిన్న వయసులోనే రాజకీయాల వైపు అడుగులు
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో విద్యార్థి దశలోనే మామిళ్ల ఆంజనేయులు గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.



1994లో జక్కన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసి కేవలం 11 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే ఆ ఓటమి ఆయన రాజకీయ ప్రయాణానికి అడ్డంకిగా మారలేదు. గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలనే సంకల్పంతో రాజకీయ, సామాజిక కార్యక్రమాలను కొనసాగించారు.
గ్రామ యువతను ఒక వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో *‘క్రాంతి యువజన సంఘం’*ను ఏర్పాటు చేసి యువతలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు.
అలాగే జక్కన్నపేట గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజల తరఫున పోరాటం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 సంవత్సరం నుంచే కేసీఆర్ గారి నాయకత్వంలో మెదక్ జిల్లాలో ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాస్తారోకోలు, బంద్‌లు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు తదితర ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వంతు పాత్ర పోషించారు.
ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యపరచడం, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించడం, ఉద్యమ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు.
దీంతో మామిళ్ల ఆంజనేయులు గారికి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు అనే గుర్తింపు లభించింది.
రాజకీయ ప్రయాణంలో ఒడిదుడుకులు
2006లో జడ్పీటీసీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. వరుస విజయాలు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనేక ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా స్థాయిలో ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందారు.
కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలు
కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో మామిళ్ల ఆంజనేయులు గారు పలు కీలక బాధ్యతలను నిర్వహించారు.
– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా
– పార్టీ అధికార ప్రతినిధిగా
– పీసీసీ కమిటీ సభ్యుడిగా
– నిజాం షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా సుమారు మూడు సంవత్సరాలు
వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.
మున్సిపల్ రాజకీయాల్లో ప్రజా ప్రతినిధిగా
మామిళ్ల ఆంజనేయులు గారు మున్సిపల్ రాజకీయాల్లోనూ తన ప్రత్యేక ముద్ర వేశారు.
5వ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
మున్సిపల్ పరిధిలో ప్రజలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, స్థానిక అభివృద్ధి అంశాలపై కౌన్సిల్లో తన వాణిని వినిపించారు.
కరోనా సమయంలో ప్రజా సేవ
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మామిళ్ల ఆంజనేయులు గారు తనవంతు సహాయ కార్యక్రమాలను చేపట్టారు.
పేద, నిరుపేద కుటుంబాలకు పండ్లు, కూరగాయలు, దుస్తులు అందించడంతో పాటు కరోనా కిట్లు పంపిణీ చేశారు. అవసరమైన వారికి వైద్య సలహాలు, ఆరోగ్య సూచనలు అందిస్తూ ప్రజలకు అండగా నిలిచారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు అందించిన సేవలు ఆయన ప్రజా సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచాయి.
తిరిగి బీఆర్ఎస్లోకి
2024 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, రాజకీయ వ్యవహారాలపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు.
కేటీఆర్ గారి సమక్షంలో గంట తిరుపతి రెడ్డి గారు, పట్లోళ్ల శశిధర్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జిల్లా స్థాయిలో నాయకుడిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలు, ప్రాంత అభివృద్ధి అంశాలపై తనవంతు కృషి చేస్తున్నారు.
2026 మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం
2026లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి పోటీ చేసిన మామిళ్ల ఆంజనేయులు గారు భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ప్రజలతో సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న అనుబంధం, ప్రజా సమస్యలపై స్పందించే విధానం, గతంలో చేసిన సేవా కార్యక్రమాలు ఆయన విజయానికి బలంగా నిలిచాయి.
భాహుజనుల రాజకీయ అభివృద్ధే లక్ష్యం
బీసీ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మామిళ్ల ఆంజనేయులు గారు ఆకాంక్షిస్తున్నారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని, యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరుతున్నారు.
‘ప్రజలకు న్యాయం చేయాలి – బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలి – యువత రాజకీయంగా ఎదగాలి’ అనే ఆలోచనతో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
మెదక్ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మెదక్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని మామిళ్ల ఆంజనేయులు గారు కోరుకుంటున్నారు.
ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చిస్తూ, అవసరమైన సందర్భాల్లో లేఖలు అందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
మెదక్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభించడం, విద్యా మరియు వైద్య సదుపాయాలు మెరుగుపడటం, పరిశ్రమలు రావడం ద్వారా యువతకు అవకాశాలు పెరగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.