“ప్రజల నమ్మకమే నా బలం… ప్రజాసేవే నా ధ్యేయం… గ్రామ అభివృద్ధే నా లక్ష్యం.”

అల్లారం యేసు రత్నం – ప్రజాసేవే పరమ లక్ష్యం

వ్యక్తిగత వివరాలు

పేరు: అల్లారం యేసు రత్నం
జననం తేది: 14-01-1982
జన్మస్థలం: మిన్పూర్  పాపన్నపేట మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ.

జీవిత పరిచయం

అల్లారం యేసు రత్నం గారు 14 జనవరి 1982న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మెనూరు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కష్టపడి పనిచేయడం, సమాజానికి సేవ చేయడం అనే లక్ష్యంతో ఎదిగారు. ఎలక్ట్రిషియన్ విద్యను పూర్తి చేసి, చదువుతో పాటు సామాజిక సేవ, రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ కుటుంబానికి అండగా నిలిచారు.

వృత్తి జీవితం

చదువు పూర్తయిన అనంతరం గ్రామంలో రేషన్ డీలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 20 సంవత్సరాల పాటు గ్రామ ప్రజలకు ప్రభుత్వ రేషన్ సరుకులను పారదర్శకంగా, సకాలంలో అందిస్తూ నిజాయితీ గల డీలర్‌గా మంచి పేరు సంపాదించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అందరి అభిమానాన్ని పొందారు.

అదేవిధంగా విద్యుత్ శాఖకు చెందిన సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా మూడు సంవత్సరాలు సేవలందించి తన విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతను చాటుకున్నారు.

సామాజిక సేవ

యేసు రత్నం గారు ప్రజాసేవనే జీవిత ధ్యేయంగా భావించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

– పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలవడం.
– కరోనా మహమ్మారి సమయంలో అవసరమైన వారికి నిత్యావసర సరుకులు, ఆహారం, ఇతర సహాయ కార్యక్రమాలు నిర్వహించడం.
– గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం.
– ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం.
– ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా సహకరించడం.

ఉద్యమ ప్రస్థానం

సామాజిక న్యాయం కోసం పోరాడే నాయకుడిగా యేసు రత్నం గారు ఎం.ఆర్.పి.ఎస్. (MRPS) ఉద్యమంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేశారు.

– రాస్తారోకోలు
– ధర్నాలు
– నిరసన కార్యక్రమాలు
– సామాజిక హక్కుల కోసం పోరాటాలు

వంటి అనేక ఉద్యమాల్లో పాల్గొని వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు తన వంతు కృషి చేశారు,

రాజకీయ ప్రస్థానం

చదువుతున్న రోజుల నుంచే వైఎస్సార్ రాజకీయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రజలతో నిరంతర అనుబంధం పెంచుకుంటూ గ్రామాభివృద్ధి కోసం రాజకీయ వేదికను సేవామార్గంగా స్వీకరించారు.

2025 సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి రిజర్వేషన్ రావడంతో ప్రజల అభ్యర్థన మేరకు సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలిచి గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

యువత కోసం సేవలు

యేసు రత్నం గారు జనచైతన్య యువజన సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు.

ఆయన నాయకత్వంలో:

– మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం.
– యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం.
– ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం.
– విద్యార్థులకు సామాజిక చైతన్యం కల్పించడం.

వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

ప్రజల కోసం లక్ష్యాలు

సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి ఈ క్రింది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

– ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం.
– గ్రామంలో నాణ్యమైన తాగునీటి సౌకర్యం కల్పించడం.
– మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు.
– విద్య, వైద్యం, పారిశుద్ధ్యానికి అత్యున్నత ప్రాధాన్యత.
– మహిళలు, యువత స్వయం ఉపాధికి ప్రోత్సాహం.
– రైతులకు ప్రభుత్వ పథకాలు చేరేలా సహకారం.
– ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి.
– పారదర్శకమైన, ప్రజలకు జవాబుదారీతనం కలిగిన గ్రామ పాలన.

గ్రామ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు, సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని అల్లారం యేసు రత్నం గారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, ప్రతి ఇంటి అభివృద్ధే తన విజయంగా భావిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా సేవలందించేందుకు అంకితభావంతో పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *