జననం, విద్యాభాస్యం
మైనంపల్లి రోహిత్ 1997 నవంబరు 1 న హైదరాబాద్ లో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులకు జన్మించాడు. ఆయన మేడ్చల్ లోని మెడిసిటీ వైద్య కళాశాల నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసి రెండు బంగారు పతకాలను అందుకున్నాడు
డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్ఫ్లూయన్సర్. ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు
సామజిక కార్యక్రమాలు, రాజకీయ జీవితం
మైనంపల్లి రోహిత్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనా సమయంలో నిరుపేదలకు తన సంస్థ ద్వారా ఆర్థిక, నిత్యావసరాలను అందజేశాడు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి పై 10,157 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.