పాశం సిద్ధిరామిరెడ్డి – యువ నాయకుడు, ఆదర్శ సర్పంచ్
జననం – బాల్యం
పాశం సిద్ధిరామిరెడ్డి 1986, నవంబరు 2న తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన ఆయన చిన్నతనం నుంచే కష్టజీవితాన్ని దగ్గరగా చూశారు.
విద్యాభ్యాసం
సిద్ధిరామిరెడ్డి ప్రాథమిక విద్య మొదటి తరగతి నుంచి పదవ తరగతి వరకు మాందాపూర్‌లో పూర్తి చేశారు.
ఇంటర్మీడియట్ విద్యను మెదక్ జూనియర్ కళాశాలలోను, డిగ్రీని మెదక్ డిగ్రీ కళాశాలలోను పూర్తి చేశారు.
చదువు తో పాటు కుటుంబాని వ్యవసాయాన్ని కూడా సమర్థవంతంగా సాగిస్తూ, గ్రామీణ జీవన విధానాన్ని అర్థం చేసుకున్నారు.
రాజకీయ ప్రస్థానం – గ్రామ యువనేత
విద్యార్థి దశ నుంచే గ్రామ సమస్యలపై ఆసక్తి కలిగిన సిద్ధిరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తన నాయకత్వ గుణాలతో గ్రామస్థుల విశ్వాసం పొంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
అంతేకాకుండా, రెడ్డి సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, సంఘ సమైక్యతకు కృషి చేశారు.
యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, తమ వద్దకు వచ్చి సాయం అడిగిన ఎవరినీ కాదనకుండా తోచినంతగా సహాయం చేసే గొప్ప మనస్సు కలిగిన వ్యక్తిగా పేరు పొందారు.
సర్పంచ్ ఎన్నికల్లో విజయం – 2025
2025 సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కారణంగా సిద్ధిరామిరెడ్డి పోటీ చేయడం సవాల్‌గా మారింది. అయినప్పటికీ, తన సామాజిక సేవ, గ్రామాభివృద్ధి పట్ల నిబద్ధత, ప్రజలతో ఆత్మీయ సంబంధాల బలంతో అత్యధిక మెజారిటీ – 100 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
ఈ ఘన విజయానికి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి ప్రోత్సాహం, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి అండదండలు కూడా కీలకంగా నిలిచాయి.
గ్రామాభివృద్ధి – ఆదర్శ గ్రామ లక్ష్యం
సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి సిద్ధిరామిరెడ్డి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఆయన ప్రాధాన్యతలు:
· సిసి రోడ్లు – గ్రామంలో అన్ని వీధుల్లో మెరుగైన రోడ్డు సౌకర్యం
· మురికి కాలువల శుభ్రత – పారిశుధ్యం, వ్యాధుల నివారణ
· పచ్చదనం, పరిశుభ్రత – పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటడం, చెత్త నిర్వహణ
గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, యువతను ఉత్తేజపరిచే విధానంలో పనిచేస్తున్నారు.
వ్యక్తిగత స్ఫూర్తి – యువతకు ఆదర్శం
సిద్ధిరామిరెడ్డి ఎంతటి పెద్ద అధికారాన్ని పొందినా సామాన్యుడిగా, మమకారంగా, అందుబాటులో ఉండే నాయకుడు.
ఎవరు వచ్చి అడిగినా సాయం చేయడంలో వెనుకాడరు. ఆయన తన అనుభవం, నేర్పు, మానవీయతతో గ్రామ ప్రజల మన్ననలు పొందుతూనే, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
“ఆదర్శ గ్రామం – పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన, సంతోషకరమైన గ్రామం” – ఈ దిశగా సిద్ధిరామిరెడ్డి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల సహకారం, తన సంకల్ప బలంతో గాంధారిపల్లి మొత్తం మండలం కె మార్గదర్శకంగా నిలవాలన్నది ఆయన లక్ష్యం.
“గ్రామం మన తల్లి – దాని అభివృద్ధే మన బాధ్యత” – పాశం సిద్ధిరామిరెడ్డి